హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ శ్రేణుల మధ్య అంజిరెడ్డి జన్మదిన వేడుకలు

SRD: పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో జిల్లా BJP అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలను కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, కార్యకర్తల సమక్షంలో శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని నేతలు తెలిపారు.