హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

WGL: వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత బుధవారం మడికొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు, పెండింగ్ ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ బాధితులకు న్యాయం చేయాలని SHO పుల్యాల కిషన్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.