హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్స్య సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

MBNR: మత్స్య సహకార సంఘం నూతన కమిటీని మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని దివిటిపల్లిలో ఎన్నుకున్నారు. కార్పొరేటర్ అనుప ఆంజనేయులు, జిల్లా సహకార సంఘం అధికారి రాజు నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు. అధ్యక్షుడిగా మూలుగు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా చెన్నారం విష్ణు, ప్రధాన కార్యదర్శిగా మేకల సత్యనారాయణ, వారితోపాటు, నూతన కమిటీ మెంబర్లను కూడా ఎన్నుకున్నారు.