MNCL: వన్యప్రాణిని విద్యుత్ తీగలతో వేటాడి మాంసం వండుకొని తిన్న ఘటనలో నెన్నెల మండలం మన్నె గూడం గ్రామానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కుశ్నపల్లి రేంజ్ అధికారి దయాకర్ తెలిపారు. మూడు రోజుల క్రితం పొలాల వద్ద విద్యుత్ తీగలు అమర్చి చుక్కల దుప్పిని హతమార్చి వండుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం తదు పరి చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
వన్యప్రాణుల వేటగాళ్లు ఐదుగురిపై కేసు నమోదు


