హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్‌కు షాక్.. 60 పరుగులకే 4 వికెట్లు

టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్ మూడో బంతికే కెప్టెన్ టామ్ లాథమ్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత డేవిన్ కాన్వే(4)ను అన్షుల్ కంబోజ్ పెవిలియన్ చేర్చాడు. రచిన్ రవీంద్ర(15)ను ఆకాష్ దీప్, డారెల్ మిచెల్(1)ను బుమ్రా ఔట్ చేశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.