TG: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని ఇవాళ మరో 7 జిల్లాలకు విస్తరించనుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దీనిని ప్రారంభిస్తున్నారు. భూపాలపల్లి, జనగాం, వనపర్తి, సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఇది అమలు కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లోని 43,657 మంది చిన్నారులకు రోజూ అల్పాహారం అందిస్తారు. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఈ పథకం కొనసాగుతోంది.
వార్తలు
అంగన్వాడీ చిన్నారులకు గుడ్ న్యూస్


