హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

KMM: ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశించారు. బుధవారం ఆయన కొణిజర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సిబ్బందికి ఆయన సూచించారు. గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.