హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: వినాయక్ నగర్-2, ఆర్యనగర్-2 ఫీడర్లపై టవర్ల నిర్వహణ పనుల కారణంగా నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-3 ఏడీఈ వినోద్ తెలిపారు. విశాల్ మార్ట్, ఓల్డ్ పోలీస్ స్టేషన్, అభిరుచి స్వీట్ హోమ్, త్రిమూర్తి ఏరియా, బీఎస్ఎన్ఎల్ కార్యాలయ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.