హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPLకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర పోస్ట్ చేశాడు. బంగ్లాదేశ్‌లో ధోనీ బ్యాటింగ్ చూసినప్పుడే అతడిలో ప్రత్యేకత ఉందని గంగూలీతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. అతడితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. అనుకున్నదానికంటే గొప్ప విజయాలు సాధించావని కొనియాడాడు. భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించావంటూ సచిన్ ప్రశంసలు కురిపించాడు.