MLG: తాడ్వాయి–మేడారం మార్గంలోని ఫారెస్ట్ వాచ్‌టవర్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటాపురం మండలం బెస్తగూడెంకు చెందిన నల్లబట్ట ప్రసాద్ (35) మృతి చెందాడు. వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. మేడారంలో మొక్కులు చెల్లించుకుని తిరిగివస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ
మేడారం నుంచి వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి


