హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చేపలు ఎలా పడుతున్నారో చూడండి

తమిళనాడు మత్స్యకారులు వినూత్న టెక్నిక్‌తో చేపల వేట సాగించారు. వేగంగా వెళ్తున్న బోటు నుంచి వల చివర పట్టుకుని సముద్రంలోకి దూకారు. ఆపై చేపల గుంపు చుట్టూ వృత్తాకారంలో భారీ వలను వేశారు. ఈ క్రమంలో నీళ్లలో దూకిన వారి దగ్గరికి బోటు వెళ్లింది. ఈ సాహసోపేతమైన చేపల వేట విధానం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.