హైదరాబాద్: 28°C
వార్తలు

ధరలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: జైరాం రమేష్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకాశాన్నంటుతున్న ధరలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి, టోకు ధరల ద్రవ్యోల్బణం 12.29 శాతానికి పెరిగిందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో కుటుంబాలు తమ బడ్జెట్‌ను పెంచుకోవాల్సి వస్తోందన్నారు.