హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

SS: శ్రీ సత్యసాయి 101వ జన్మదిన వేడుకల సందర్భంగా జీవీఎంసీ 79వ వార్డు కోదండ రామస్వామి ఆలయంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహిళా యూత్ వింగ్ గాజువాక సమితి, ఇండస్ట్రీయల్ కాలనీ భజనమండలి సంయుక్తంగా నిర్వహించిన శిబిరంలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి, గైనకాలజీ, ఈఎన్టీ సేవలు అందించారు. 150 మంది హాజరై, 35 మందికి కంటి ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు.