హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఓటర్ జాబితా విడుదల'

E.G: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 23న ప్రచురించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 707 విద్యా సంస్థల నుంచి 5,052 మంది అర్హులకు గాను ఇప్పటివరకు 3,270 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. వాటి పరిశీలన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.