హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేస్తాం '

KKD: కాకినాడ జిల్లా కూటమి నేతలు ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో ఉమ్మడి విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ఐక్యంగా ఉందని, రెబల్ అభ్యర్థులను వెంటనే సస్పెండ్ చేస్తామని, వారికి మద్దతిచ్చేవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. కాకినాడ నగరపాలక సంస్థలోని అన్ని స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. టికెట్ దక్కని ఆశావహులకు ఏడాదిలో నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.