ASR : అరకులోయ సమీపంలోని చంపి జంక్షన్ బ్రిడ్జి కింద వాగులో ఈ రోజు ఉదయం యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలిని డుంబ్రిగూడ మండలం గుంటగిన్నెల గ్రామానికి చెందిన కిలో మీన(20)గా గుర్తించారు. ఆమె అరకులోని ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
వాగులో యువతి మృతదేహం లభ్యం


