హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చక్రాయపేటలో ఉద్రిక్తత.. 30 వాహనాలు ధ్వంసం

చక్రాయపేట మండలం సురభి పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆటోతో పాటు సుమారు 30 ద్విచక్ర వాహనాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. గ్రామంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, పోలీసుల సమక్షంలో దాడులు జరిగాయని వైసీపీ శ్రేణులు విమర్శించాయి.