హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోండి: సీఐ

W.G: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆకివీడు మండలం గుమ్ములూరులో బుధవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆకివీడు సీఐ కాళీ చరణ్, ఎస్సై శుభ శేఖర్ గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.