హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ గుర్తింపులో అనంతపురం టాప్

ATP: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులను ఉన్నత వైద్య చికిత్సకు పంపడంలో అనంతపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్‌సీడీ సర్వేలో వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల సమష్టి కృషితో ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అవార్డు, ప్రశంసాపత్రం అందజేసిందన్నారు.