హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నబోనాలలో పింఛన్ల కోసం నిరసన

SRCL: చిన్నబోనాల 10వ వార్డులో పింఛన్ల మంజూరుపై లబ్ధిదారులు నిరసన తెలిపారు. 39 మంది దరఖాస్తు చేయగా, విచారణలో అందరూ అర్హులని తేలినా 27 మందికే మంజూరయ్యాయని వారు ఆరోపించారు. మిగిలిన 12 మంది సినారె కళామందిరంలో జరిగిన పత్రాల పంపిణీని బహిష్కరించారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, మూగ చెవిటి బాలలు ఉన్నారని, అందరికీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.