హైదరాబాద్: 28°C
తెలంగాణ

18 ఏళ్లు నిండితే ఓటరుగా నమోదు: కలెక్టర్

NLG: ఓటరు అవగాహనపై నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ బహుమతులు సాధించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకాంక్షించారు. నల్గొండ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలను ఆయన పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.