హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంజనీరిగ్ కళాశాలల నిర్వాహణకు కొత్త డైరెక్టర్లు

WGL: కాకతీయ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల హాస్టళ్ల నిర్వహణకు ఏడాది కాలపరిమితితో ముగ్గురు జాయింట్ డైరెక్టర్ల నియామకాలు జరిగాయి. రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ఆదేశాలతో బ్లాక్-ఏకు డాక్టర్ బి. అనిల్ కుమార్, బ్లాక్-బి, సీలకు వి. అమరేందర్, మెస్‌ నిర్వాహణకు డాక్టర్ కే. విజయ్ కుమార్ నియమితులయ్యారు.