హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి బీమా పథకం అమలు: కమిషనర్

MHBD: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. 18-59 ఏళ్ల మధ్య వయసు ఉండి, రేషన్ కార్డు కలిగిన కుటుంబ పెద్దలు మున్సిపల్ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాన్ని అర్హులందరూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.