హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చిన అరుదైన అలుగు

శ్రీకాకుళం : జిల్లాలో జనావాసాల్లోకి అరుదైన వన్యప్రాణి... ఆలుగు చొచ్చుకు వచ్చిన ఉదంతం ఇది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రామయ్యపట్నం గ్రామానికి చెందిన మత్స్యకారుడు జోగారావు ఇంటి పెరట్లోకి ఒక అలుగు జొరబడి, అక్కడ ఉన్న వలలో చిక్కుకుంది. ఇది గమనించిన మత్స్యకారుడు అలుగును సురక్షితంగా రక్షించి, కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.