హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగుండంలో 3,057 మందికి నూతన పింఛన్లు

PDPL: గోదావరిఖని గాంధీ చౌరస్తాలో రామగుండం నియోజకవర్గంలోని 3,057 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నూతన పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఇందులో వితంతువులు 1,754, ఒంటరి మహిళలు 488, వికలాంగులు 703, చేనేత కార్మికులు 50, గీత కార్మికులు 62 మంది ఉన్నారు. నవంబర్ 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు.