హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై చర్చ

AKP: సర్పంచ్ ఎన్నికలను జిల్లాలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం అనకాపల్లిలో ఎంపీడీవోలు, పోలీస్ అధికారులతో నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని సూచించారు. పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.