హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గడువులోగా ఎమ్మెల్సీ ఓటరు జాబితా సవరణ పూర్తి'

BPT: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా సవరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సీఈవో వివేక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని 12 మండలాల్లో దరఖాస్తుల ఆన్‌లైన్ పరిశీలన వేగంగా సాగుతోందన్నారు. నకిలీ, మూడేళ్ల నివాస అర్హత లేని వాటినే తిరస్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.