హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సురక్షిత బాల్యం బాలల రక్షణ ఉద్యమంపై అవగాహన

VZM: గజపతినగరంలోని శ్రీకృష్ణ విద్యాపీట్‌లో బుధవారం సురక్షిత బాల్యం బాలల రక్షణ ఉద్యమంపై న్యాయవాదులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలు విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాంబాబు, న్యాయవాదులు వాసుదేవరావు, ఆదినారాయణ పాల్గొన్నారు.