GNTR: మంగళగిరి ఎల్.బీ. నగర్‌కు చెందిన గోళ్ల రాజశేఖర్ ఈ నెల 17న కొప్పురావు కాలనీ కొత్త రామాలయం నుంచి నిర్మలా కాన్వెంట్‌కు వెళ్తుండగా లక్ష రూపాయలకు పైగా విలువైన బంగారు బ్రాస్లెట్ పోగొట్టుకున్నారు. ఈ మేరకు ఆయన స్థానిక PSలో ఫిర్యాదు చేశారు. బ్రాస్లెట్ దొరికిన వారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తే రూ.10 వేల నజరానా అందజేస్తామని సీఐ వెంకట్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బంగారు బ్రాస్లెట్ దొరికితే రూ.10 వేల నజరానా


