హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కాయకల్ప బృందం

AKP: రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాయకల్ప బృంద సభ్యులు మణికంఠ, శోభ బుధవారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్, డెలివరీ రూమ్, వ్యాక్సిన్ గదులతో పాటు పారిశుద్ధ్యం, రికార్డులు, వైద్య వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో వైద్యులు పాల్గొన్నారు.