హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి: AO

MDK: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో యాసంగిలో వరికి బదులు జొన్న, మొక్కజొన్న, సజ్జ, నువ్వులు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏవో ప్రవీణ్ కుమార్ సూచించారు. అక్కన్నపేట, ఝాన్సీ లింగాపూర్ గ్రామసభల్లో రైతులకు అవగాహన కల్పించారు. సబ్సిడీ విత్తనాలు, ఆయిల్‌పామ్ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.