హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయంలో చిత్రలేఖనం పోటీలు

కోనసీమ: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కొత్తపేట ద్వితీయ శ్రేణి శాఖా గ్రంథాలయంలో బుధవారం పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే పోటీల ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.