RR: సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఎల్బీనగర్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు షీ టీమ్స్ పనితీరు, సైబర్ నేరాలు, లోన్ యాప్స్ వేధింపులు, సీడీఈడబ్ల్యూ (CDEW) కౌన్సెలింగ్ కేంద్రాలు, మానవ అక్రమ రవాణా, లింగ సమానత్వం, సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
పాఠశాలలో 'షీ టీమ్స్' అవగాహన సదస్సు


