హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశేషంగా ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు

సత్యసాయి: పుట్టపర్తిలో రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కళాకారుల విభిన్న వేషధారణలు, సంప్రదాయ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో పుట్టపర్తి వీధులన్నీ కిటకిటలాడాయి. భక్తిశ్రద్ధల నడుమ జరిగిన ఈ వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.