హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రులకు కలెక్టర్ హెచ్చరిక!

PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు అందిన 157 ఫిర్యాదులను సమీక్షించి, నగదు వసూళ్లపై వచ్చిన 9 ఫిర్యాదులను చర్చించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రికి మూడుసార్లు జరిమానా విధించినట్లు తెలిపారు. రోగుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు వసూలు చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.