KKD: కాకినాడ పి. ఆర్. అటానమస్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వ్యాసరచన పోటీలో కె. ప్రణీత ప్రథమ స్థానం సాధించగా, క్విజ్ పోటీలో ఎం. జస్వంత్, పి. నెల్సన్ బాబు సంయుక్తంగా ద్వితీయ స్థానం పొందారు. విద్యార్థులు సాధించిన విజయంపై కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సత్తా చాటిన జగ్గంపేట కళాశాల విద్యార్థులు


