ప్రకాశం: బేస్తవారిపేట మండలం సలకలవీడు, కలగొట్ల గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ గ్రామసభ నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు కార్డులు పొందాలని, వాటి ద్వారా అన్నదాత సుఖీభవతో పాటు ప్రభుత్వం అందించే పలు పథకాలకు అర్హత పొందవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బేస్తవారిపేటలో 'పొలం పిలుస్తోంది'


