హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 24న కార్తీక పూర్ణిమ వేడుకలు

SRD: సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 24న కార్తీక పూర్ణిమ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం సామూహిక అభిషేకాలు, సాయంత్రం 5 గంటలకు గంగా హారతి, 5.30కు పల్లకీ సేవ, 6 గంటలకు ఆకాశదీపం, రాత్రి 7 గంటలకు లక్ష దీపార్చన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.