PLD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పట్టణంలోని 48 వార్డుల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలు, బూత్‌లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే


