హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధిక శబ్దాలు చేస్తున్న వాహనాలపై చర్యలు తప్పవు'

కృష్ణా: గుడివాడలో నిబంధనలకు విరుద్ధంగా మోటార్ సైకిళ్ల సైలెన్సర్లను తొలగించడం, మార్పులు చేయడం ద్వారా అధిక శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇవాళ వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. కొంతమంది వాహనదారులు బుల్లెట్ షాట్స్ పేరుతో భారీ శబ్దాలు చేస్తూ, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారని తెలిపారు.