హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.15 కోట్ల రోడ్డు పనులకు గ్రహణం

SRD: కొండాపూర్ మం మల్లేపల్లి-హరిదాస్ పూర్ రోడ్డు విస్తరణ పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. రూ. 15 కోట్ల వ్యయంతో 7 KM మేర చేపట్టిన పనుల్లో రోడ్డు ఇరువైపులా కటింగ్ చేసి కంకర వేసి వదిలేశారు. తదుపరి పనులు ప్రారంభించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.