కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం గ్రామ పంచాయతీ 75 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. నూతన సర్పంచ్‌గా ఎన్నికైన అయితాబత్తుల రాజశేఖర్‌ను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం ఐక్యతతో ఈ నిర్ణయం తీసుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'75 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి'


