BHPL: అంగన్వాడీ చిన్నారులకు అల్పాహారం అందించే ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రభుత్వం కొత్తగా ఏడు జిల్లాలకు విస్తరించింది. ఇందులో భూపాలపల్లి జిల్లాకు కూడా చోటు కల్పించారు. ఈ పథకం రేపటి నుంచి అమల్లోకి రానుంది. జిల్లాలోని అంగన్వాడీ చిన్నారులకు ఉదయం పౌష్టికాహారం అందుబాటులోకి రానుంది. చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.
తెలంగాణ
జిల్లాలో ‘తొలిముద్ద’ పథకం


