హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ పాఠశాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు

VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎన్. తేజ్ భరత్ బుధవారం పలు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా కొత్తవలస జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఎమ్మార్వో రమాలక్ష్మి, ఎంపీడీవో ఎస్. రమణయ్య, సీఐ తదితరులు పాల్గొన్నారు.