హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖేత్ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన

అన్నమయ్య: చిట్వేల్ మండలం మారటిపల్లిలో బుధవారం ఖేత్ బచావో అభియాన్ నిర్వహించారు. నేల ఆరోగ్యం, భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. అరటి, సిట్రస్ పంటల యాజమాన్యం, తెగుళ్ల నివారణ, సేంద్రియ ఎరువుల వినియోగంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. మానస, డా. సాయి మహేశ్వరి, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.