హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

19న చిట్వేలిలో ఎంపీపీ ఎన్నికలు!

అన్నమయ్య: చిట్వేలి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. కో ఆప్షన్ సభ్యత్వానికి పోటీ చేసే అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. మధ్యాహ్నం 1 గంటకు కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక, 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.