హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విస్సన్నపేటలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక

NTR: విస్సన్నపేట మండల పరిధిలో జరగనున్న స్థానిక ఎన్నికలకు బీజేపీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. ఈ మేరకు డాక్టర్ వీరభద్రరావు నివాసంలో పార్టీ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షురాలు పోలె శాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నాయకులకు తగిన సూచనలు చేశారు.