హైదరాబాద్: 28°C
తెలంగాణ

MPDO కార్యాలయం ఎదుట CPM, BRS సర్పంచుల నిరసన

KMM: నూతన పెన్షన్ పత్రాల పంపిణీలో తమకు సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆరోపిస్తూ CPM, బీఆర్ఎస్ సర్పంచ్‌లు బుధవారం ముదిగొండ ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. MPDO పక్షపాత వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.