హైదరాబాద్: 28°C
తెలంగాణ

దానవాయిగూడెంలో మంత్రి పొంగులేటి

KMM: దానవాయిగూడెంలో 'చేయూత' పథకం కింద కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై, లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలేరు ఆత్మ కమిటీ ఛైర్మన్ చావా శివరామకృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.