హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్‌ఫండ్ మోసం..ఇద్దరిపై కేసు

WGL: కరీమాబాద్‌లోని అక్షోభ్య చిట్‌ఫండ్ సంస్థ నిర్వాహకులు చిట్టీ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని పెంచాల రాజు బుధవారం మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్టీ పూర్తయినా రూ.9.80 లక్షలు తిరిగి చెల్లించలేదని వాపోయారు. దీంతో సంస్థ ఛైర్మన్ ముష్కమాల సుధాకర్, డైరెక్టర్ కోలా జనార్దన్‌‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.